శ్రీ గురుభ్యోన్నమః
====================================
యోగాచార్యా వందనం
ప. యోగమునందానందము నొందెడి యోగాచార్యా వందనం యోగి రామా వందనం
1. మంచి ముత్యమై నీ మనసున్నది ఆప్యాయత ఆదరణ యున్నవి
నిత్యానందము సత్యాన్వేషణ నీ మది నిండుగ నిండి యున్నవి
2. కారణ జన్మము నీదై యున్నది కల్మష రహితము హృదయమున్నది
ధన కనకములందాశయె లేదు ఆత్మ తత్వమున సంచరించుచు
పరమ సత్యమును పంచుచునున్న
3. మనసున పుట్టెను మాయ అంటివి మనసు విరుగ మాయ తొలగునంటివి
మౌన ముద్రలో మర్మమంటివి పరబ్రహ్మమే దర్శనమంటివి
4. అంతరమందానందమునొందుచు నిత్యము సంతోషమ్ముననుంటివి
చైతన్య జగతిలో సంచరించుచు రహదారిని దరి చేర్చుచుంటివి
ప.శ్రీ రామ చరితం సంతోష భరితం మన రామ చరితం మధురాతి మధురం
1.రాపర్తి వంశము రమ్యమైనట్టిది అందు జన్మించెను రాముడొకరుండు
ఆత్మవిద్యయందు ఆరితేరినవాడు అర్హులందరకును అందించగలదిట్ట
ఆత్మవిద్యయందు ఆరితేరినవాడు అర్హులందరకును అందించగలదిట్ట
2.చిన్నతనమునుండి చిద్విలాసుండు చింతలేలేనట్టి శాంత పురుషుండు
గర్వమేలేనట్టి సుగుణాలరాశి సత్యవ్రతుండు సాధువతడు
3.గహనవిద్యను నేర్పే గంగయ్య గురువు రామలాలుని సత్య సాంప్రదాయమున
మనో జయమును పొందె మౌన వ్రతుండై అంతర్ముఖుండై అభ్యాసమే చేసె 4.తపమాచరించెను తానెవరో తెలియ తనదు నిజరూపమును నేర్పుతో దర్శించె
ఆత్మ తత్వమునందు నిశ్చలుండైనట్టి మృత్యుంజయుండతడు అమృతుండు
ఆత్మ తత్వమునందు నిశ్చలుండైనట్టి మృత్యుంజయుండతడు అమృతుండు
5.గురువులకుగురువై బాధ్యతాయుతమైన పదవినేలెను పరమఆనందభరితుడై
తదనంతరమ్మే తనదుఅంతర్వాణి బోధించెనాతని ప్రబోధమ్ము చేయ
6.సంకల్పబలముచేసత్యమునుగ్రహియించి సంకల్పమేచేసే సత్యమునుతెలుప
గురునిగావెలుగొంది గుహ్యాతిగుహ్యమగు గహనవిద్యను నేర్పు సాధకులకు
7.వెలకట్టలేనట్టి ఔదార్యమాతనిది ధనముతో పనిలేని దివ్యపురుషుండు
తత్త్వమస్యాది లక్ష్యమును నెరవేర్చు సచ్చిదానంద స్వరూపుడతడు
8.విజినిగిరియందలి ఆశ్రమమ్మునవెలసి ఆశ్రయమ్మిచ్చెను అర్హులందరకు
ఆచార్యుడై యోగఆచార్యుడై యుండ మహదానందమే మనకు అందరకు
మా గురుదేవులు యోగాచార్య శ్రీ రాపర్తి రామారావుగారు
ప. మనసునెరిగిన దేముడు మన విజినిగిరి రాముడు
చైతన్యధామ వాసుడు చైతన్యుడే మన రాముడు
1. కరుణాంతరంగుడు కమనీయ హృదయుడు
కనికరమ్మే చూపును కల్పవృక్షము ఆతడు
2. జ్ఞాననిధి మన రాముడు తత్వజ్ఞాన నిఘంటువు వి
జ్ఞానియైన భిషజుడు సుజ్ఞానసంపద ఆతడు
3. సాధకులనెల్లప్పుడు సన్నుతులను చేయును
మనోభావమునెరిగిన మౌనివర్యుం డాతడు
4. రాము సన్నిధినుండగ మహనీయ గుణములు కలుగును
సాధకుండే వుండును సత్యమార్గము నందును
రచన: కొడవంటి... smkodav@gmail.com
ప. యోగి రాముని సన్నిధానం మనకందరకు పెన్నిధానం
మధురమైనది ఈసమయం మహదానంద దాయకము
1.బ్రహ్మజ్ఞానము కలిగినమనుజుడె బ్రహ్మణుండగుననెడి సత్యమును
అనుభవించిన ఆచర్యుండు సచ్చిదానంద స్వరూపుడైన
2.స్వపర భేదము భావమె కలుగదు సర్వులను సమ దృష్టి చూచును
నిగర్వియనిన అతడేనండీ నిత్యము సత్యమునందున నిలచెడి
3.లీలామానుష విగ్రహరూపుడు నిగ్రహమెంతయో కలిగినవాడు
అనుగ్రహమ్మే ఆతని సొత్తు ఆదరించుటయె తెలిసినట్టి మన
4. జంఝాటమ్మే లేనిజగమును సృష్టినిచేయును మనలోనాతడు
దృష్టియంతయా సృష్టినుండుటకు సూచనలెన్నియోచేయుచునుండెడి
5.రాజయోగమే రాజమార్గమని అమనస్కమ్మే ఆత్మసాధనని
తారక సంఖ్య అమనస్కములను బోధనచేసెడి భాస్కరుడైన
6.విశ్వమాతనికి వినూత్నస్వప్నము స్వప్నజగతిలో చిత్స్వరూపుడు
సత్యమునెరిగిన నిర్గుణుడాతడు ఇహపరములలో యీశ్వరుడైన
7.బాహ్యసుఖము అంతయుబంధము అంతరమందానందము గలదని
సాధకులకు వినువిందుచేయుచు బంధవిముక్తుల చేయుచునుండెడి
8.రజ్జుసర్పమను భ్రాంతినివీడిన ఇంద్రియమనములు చలనరహితమై
నిశ్చలుండగుట నిశ్చయమ్మని విశదపరచు విశ్వంభరుడైన
9.సాకారమ్ము సత్యముకాదు నిరాకారమే నిత్య సత్యమని
======================================
GOOGLE EARTH AREAL VIEW OF VIJINIGIRI ASHRAM
http://wikimapia.org/4548957/Raparthi-Rama-Rao-Yoga-Ashram-Vijinigiri======================================
విజినిగిరి ఆశ్రమ వైభవము
ప.ఆశ్రమమెంతయో సుందరమైనది విజినిగిరీశుని తపోవనమది
గురుని శోభతో గుభాళించునది గురుని కటాక్షము లభించునట్టిది
1.భారతీయుల దేశము యనిన కుల మతములకు అతీతమైనది
అందునగలదుఆంధ్రరాష్ట్రము విజయనగరమునజామిమండలము
వేద సారమును ఆస్వాదించెడి విజినిగిరిని గల ఆశ్రమము
అత్యద్భుతముగ నిర్మితమైనది విశ్వకర్మయే మెరుగిడినటుల
2.పేరు ప్రతిష్ఠల పెన్నిధి అయ్యది దేశదేశముల పరిఢవిల్లినది
యోగములోనే విరాజిల్లునది చైతన్యముతో నిండి యుండునది
బౌద్ధారామము తలపించునది బాదరబందీ లేనటువంటిది
యోగచైతన్య ఆరామమ్మది యోగులెందరికో పుట్టినిల్లది
3.గురువులేనిదేగురుకులముండదు సద్గురుదేవునిసన్నిధిఅదియే
యోగి రామునిదేవాలయమది నిత్యము సత్యమునిలచునట్టిది
సాధకులుందురు ఆశ్రమమందున సత్యాన్వేషణ వారి జీవనము
సంధ్యలన్నిట సాధన చేతురు ప్రదోషవేళల ప్రార్ధన చేతురు
రచన: కొడవంటి...smkodav@gmail.com
==================================================
4.ఆశ్రమవాసులుఆస్తికులండి నిత్యముకొలుతురునిర్గుణతత్వము
గురుదేవులతో సంభాషింతురు సగుణ నిర్గుణ సనాతనములను
గురూపదేశము వారికివరము స్థిర చిత్తముతో సిద్ధులయ్యెదరు
తపించుచుందురు తమలోతాము దివ్యజ్యోతిలో దివారాత్రములు రచన: కొడవంటి...smkodav@gmail.com
ప. దర్శింప రారండి దివ్యమౌ రూపమ్ము
గుహ్యమౌ రూపమ్ము గురుని రూపమ్ము
1. బాహ్య గురువు అతడె అంతరాత్మ అతడె
బాహ్యాంతరమ్ముల భవ్యుడును అతడె
భగభగ భాసిల్లు భానుమండలమతడె
చైతన్య వంతుడు చిదంబరుడతడె
2. మనతోడ మాటాడు మౌనివర్యుండతడె
సాధకులయందు గల సత్యరూపుండతడె
కరుణ వెదజల్లెడి కర్మ యోగియునతడె
దేదీప్యమానమగు ద్రష్ఠయును అతడె
3. అందరకు బోధించు ఆప్యాతను నిండ
అత్యంత గూఢమగు అంతరాత్మ విద్య
సహజముగ పలుకును సత్యమును పలుకును
మధుర మధురమ్ముగా మర్మమనునది లేక
4. గురునియందుగల స్పందనను దర్శించు
నిజమైన వెలుగును వెలిగించె మనలోన
దీపమే వెలిగించు వేవేల జ్యోతుల
సత్య దర్శికే సాధ్యమయ్యెడి విద్య
5. మనలోనగలజ్యోతి మహా తేజముగలది
భేద భావము లేని భగవాను రూపమది
జన్మరాహిత్యమున సత్య మార్గమ్మది
గురుని నిజ రూపము గురుతత్వమిదియే
రచన: కొడవంటి ... smkodav@gmail.com
====================================
1.ఇట్టి కనుల బ్రహ్మమెట్లు చూడగవచ్చు
చూచు కనులు వేరు చూపు వేరు
చూపు లోన మలచి చూడంగ వలవదా
విశ్వదాభిరామ వినుర వేమ
=====================================
=====================================
బొమల మీరీ కాంతి బొంద జేయు
క్రమమెరింగి లోని కాంతిని పట్టుమ
విశ్వదాభిరామ వినుర వేమ
======================================
======================================
3.చూపుననున్నది సర్వము
చూపేమారిన లోకము చట్టున మారున్
గోప్యంబౌ జ్ఞానంబిది
నేర్పుగ దీనిని విడువక నేర్వర సత్య
===========================================
===========================================
యోగి రాముని వైభవం
ప.విజ్ఞాననిధియైన విజినిగిరినాధుని రమ్యగుణరాశియగు రాపర్తిరాముని
గురునిరూపుడైన పరబ్రహ్మమును శరణాగతులమై సేవింతుమెపుడు
1.ప్రత్యగాత్మ స్వరూపుడైనట్టి తనకు పరమాత్ముడైనట్టి శ్రీరామునకును
సమరసైక్యాను సంధాన సరణియే యోగమని తెలిసిన యోగియగువాని
తారక సాంఖ్య అమనస్కమంతయు కాచి వడబోసిన కరుణాబ్ధి సోముని
నేను నేననువాడ నేనేయటంచు తెలియబడు వృత్తిలో తెలివిగలవాని
2.తెలియబడుచున్నవిశ్వమేదృశ్యమని తెలివియై సర్వమునుదర్శించువాని
అంతరానందమే అంతటనునింఢెనని సత్యసారమ్మును వివరించువాని
నిశ్చలుండనితెలియునిత్యుడైనవాని ఇంద్రియమ్ములువశమునందున్నవాని
ప్రేమమీరంగ శ్రీరామరామయనుచు స్వస్వరూపానుభవమైన స్వామివరుని
3.తారకంబది మనస్సుద్ధి కారకము సాంఖ్యమాత్మస్వరూప విమర్శకమ్ము
అనుభవ జ్ఞానమే అమనస్కమనుచు సాధకులకందరకు బోధించువాని
రాగము ద్వేషము బాగుగానశియింప ఆత్మానుభవమే ఆనందమగునని
ఆత్మవిద్యనునేర్పు నేర్పుగలవాని ఆత్మారాముడగు ఆదిత్యహృదయుని
4.శరీరభ్రమతోడ మనుజుడెల్లపుడు ఇంద్రియసుఖములకోరుకొనుచుండు
నిజమునకాతడు సచ్చిదానందుడు నిర్గుణుడనెడి నిక్కమును తెలిపిన
నానాకర్మజవాసనలుయేమియును అంటని ధీరుని ఆగణిత సోముని
బ్రహ్మానందమే అనుభవమ్ముననున్న మౌనివర్యుని మనగురుమూర్తిని
5.సాకారమ్ము సత్యమ్ము కాదని నిరాకారమ్మే నిశ్చలత్వమ్మని
తత్వోపదేశమున ద్రష్టగా మారి రజ్జుసర్ప భ్రాంతి రమ్యముగ వీడి
ఆనందజలధిలో జలకమ్ములాడి జీవన్ముక్తుడైయుండు సాధకుడనెడి
మమతానురాగాల మహనీయమూర్తిని యోగివర్యుండైన యోగాచార్యుని
రచన: కొడవంటి ... smkodav@gmail.com
వీడియొ: 22.03.2006
======================================
సంస్కారవంతుడు సన్యాసిరావు
(DONER OF VIJINIGIRI ASHRAM SITE) (14.11.1949--27.05.2007)
(02.06.2007 న ఆశ్రమములో సంతాపసభలో పాడిన పాట )
(DONER OF VIJINIGIRI ASHRAM SITE) (14.11.1949--27.05.2007)
(02.06.2007 న ఆశ్రమములో సంతాపసభలో పాడిన పాట )
1.సంస్కారవంతుడు సన్యాసిరావు సేవాదురంధరుడు సత్పురుషుడతడు
గురునిసన్నిధిలోన యోగవిద్యను నేర్చే గొర్రెపాటి వంశ వుద్భవుండతడు
2.మమకారము మంచిముత్యమ్ములైమెరసె ముముక్షువులందరకు ముచ్చటగపంచె
మారుమాటాడకనె మంచిచేయుచునుండె మరుజన్మమే మహనీయుడతడు
3.ఆప్యాయతనుపంచి ఆనందముగనతడు తలమానికమ్ముగా మెలగుచుండెడివాడు
న్యాయమగు వృత్తిలో న్యాయవాదియయ్యే అన్యాయములనెన్నో అరికట్టినాడు
4.అత్యద్భుతమ్ముగా అలరారుచున్నట్టి చైతన్యారామ వసుధనంతయును
గురుదేవుపాదాల సమర్పణచేసి శరణాగతుండైన సాధు జీవనుడు
5.గురునియందుభక్తి మెండుగాగలిగి గురుశిష్యబంధమ్ము నేర్పుతోతెల్పి
సాధకులకేందరికొ సన్నిహితుడైనట్టి సాటిలేని మేటి సాధుపుంగవుడు
6.చైతన్య సంస్థను సంస్కరింపగనెంచి చాకచక్యముతోడ సేవలెన్నియొచేసి
గురురామునికృపకు పాత్రుడైనాడు మహనీయగుణముల మాన్యుడతడు
7.జ్ఞానయోగిఅతడు సుజ్ఞానవంతుడు అమృతము గ్రోలిన మృత్యుంజయుండు
మనమధ్యనున్నాడు మనలోననున్నాడు గురుదేవుహృదిలోన గుప్తముగనున్నాడు =====================================
Dr. C. Sadasiva Rao doner of the
BHEEMILI ASHRAM SITE
Dr. C.SadasivaRao demonstrating the touch therapy technique.
Pyramid therapy offers an excellent remedy for chronic ailments, which are often written off in allopathy, according to the eminent physician, C. Sadasiva Rao, who has been practising it on his patients for the past three years. "I have been experimenting with the system at my farmhouse near Madhurawada for the past four years,'' he told reporters here on Wednesday and revealed that he had been invited to present a paper on the subject at the World Association of Non-Linear Mathematics to be held in Florida from July 1 to 7. During his 50 years of medical practice, he found several cases for which there was no cure. He realised that the progress in medicine was dismal in the last 50 years. He gave up practice in 1994.
In January 2000, Dr. Rao went to the ashram of his guru, Raparthi Rama Rao of Vizianagaram, and saw him conducting experiments with pyramids. "He took a pyramid and placed it on my head and that night I experienced a rejuvenated feeling and had good sleep. From then onwards, I started experimenting with pyramids and have read a lot of books on the subject.'' He developed a pyramidal prototype of headgear and conducted experiments which gave excellent results.
"The patient has to sit in a still position, facing the north, for about 10 minutes. A pyramid made of glistening white paper board would be placed on his head and cosmic energy would flow through the object into the patient's body,'' he explained.
Dr. Rao is also employing touch therapy which involves remote transmission of energy. ''There is no need of actually placing a pyramid on the head and it's enough if the transmitter of the cosmic energy, has an image of the pyramid in his mind. However, operator consciousness is very important in this kind of transmission.'' The best part of pyramidology was that it could be used along with other forms of medicine, he said and demonstrated pyramidology, employing touch therapy, on the president of the Visakhapatnam chapter of Association of British Scholars, D. Panduranga Rao, and a couple of journalists on Wednesday.
======================================
B. MADHU GOPAL
http://www.hindu.com/mp/2004/06/21/stories/2004062102120400.htm======================================
నంద్యాల యోగ చైతన్యారామం
ప.వినరండి వినరండి విశేషమొకటి గురుడు వీక్షించెడి గూడార్ధమొకటి
గురునిదృష్టికే గోచరమ్మగునది నమ్మశక్యముగాని నగ్నసత్యమ్ము
1.నంద్యాలనగరము నవనవోన్మేషము నంద్యాలవాసులు నవనాగరికులు
నవనందీశ్వరుల నాట్యసౌధమ్మది నాదబ్రహ్మమ్మెపుడు నర్తించుచుండు
శివుని క్షేత్రమ్మున స్థిరనివాసులై సాధనసంపత్తి సమకూర్చుకొనిరి
ఆస్తికత్వముతోడనలరారువారు ఆత్మప్రబోధమన అత్యంత భక్తి
2.దామోదరుండను దయగలయువకుడు నంద్యాలఅరుదెంచె గురునికృపతోడ
యోగవిద్యయందు యోగ్యుడైనవాడు రాజవిద్యయందు రాటుదేలినవాడు
సాధకులనెందరినొ సమకూర్చుకొనియె సత్యభాషణమున సమ్మోహపరచె
గురిగలిగెవారలకు ఆతనియందు దయతోడ వారలకు దారిచూపించె
3.విజినిగిరిలోనున్న వీరబ్రహ్మమ్ము రాపర్తిరాముడే అందరకు గురువు
వటుడింతైనట్లు వర్ధిల్లినారు నిష్కామకర్మమున నిష్ణాతులైరి
యోగవిద్యయందు యోగ్యులైనారు అష్టాంగయోగమున అనుభవజ్ఞులైరి
సామర్ధ్యమున్న సాధకులనంగ గురు రాము కృపాకు పాత్రులైనారు
4.సాధకులుఅందరూ సమావేశమ్మై స్వంతభవనమునే సమకూర్చవలెననిరి
భవనాశి వంశజుడు శ్రీరామమూర్తి భూమిని కొంత దానమ్ముగానిచ్చే
వ్యయప్రయాసలకోర్చి వెచ్చించినారు వలయువసుధనువారు సమకూర్చుకొనిరి
గురుని సంకల్పబలముతోడుతను భవననిర్మాణమ్ము ప్రారంభమయ్యే
5.దయగలదాతలు దానకర్ణులు చైతన్యసంస్థ సాధకజనము
యెందరెందరొ కలసి సహాయపడిరి అదృశ్యహస్తమ్ము ఆవిర్భవించె
త్వరితగతితోడ సహకారమందే భవననిర్మాణమ్ము బాగుగాసాగె
అన్ని హంగులతోడ నిర్మితమ్మాయే యోగిరామునిచే ప్రారంభమాయేరచన: కొడవంటి smkodav@gmail.com
======================================
ప. బ్రహ్మానందమే బ్రతుకునకు బాట
బ్రహ్మమును దర్శింప బ్రహ్మమే తానౌను
1. యదార్ధమ్మనునది యెల్లపుడు ఒక్కటియె
నిదానమ్ముగ గనుమ నిత్యసత్యమ్మదియె
సదా దర్శనమగును లోని సత్యమ్మదియె
చిదానందమ్మది సహజ స్థితి అదియె
2. లోని మర్మము తెలియ లోకమ్ము తెలియు
జ్ఞానియగు నాతనికి జ్ఞానమ్ము తెలియు
మౌనివర్యునకు మృత్యుజయమే తెలియు
ఆణిముత్యము వానికన్నియును తెలియు
=====================================
ఆశ్రమ ఫోటోలు కొన్ని ఈ క్రింది సైటులో చూడగలరు http://picasaweb.google.com/113503661686702300911/VIJINIGIRIVAIBHAVAM02?authkey=Gv1sRgCLjEw9qarfyImQE&feat=directlink
====================================
====================================
====================================
======================================
ఆత్మదర్శనము (వసంత రాగము-ఆది తాళము)
ప.అద్భుతమైనది ఆత్మదర్శనము గురునిదృష్టిచే గోచరమగునది
సాంప్రదాయమున సాగుచుండునది సాధనముననే చెంతచేరునది
1. ఉన్నతమైనది ఊర్ధ్వకుండలిని బాలభానుని స్వస్వరూపమది
సూర్యోదయమును చక్కగచూసిన భానోదయమే జరుగునులోలో
గురునిప్రేరణను గురుతుగనిలిపిన కనుల మధ్యనేకనువిందగును
చక్రములందున శక్తిదర్శనము సహస్రారమున శివుని దర్శనము
2.ఎఱుక ఒక్కటే వున్నతమైనది ఏకాగ్రతతో యెఱుకయు గలుగు
విశ్వమంతయు నిండుగ నిండిన విశ్వేశ్వరుడే తానని తెలియు
స్థూలమంతయు సూక్ష్మమె అగును చైతన్యమ్మే శాశ్వతమగును
జ్ఞానోదయమే కలుగును లోలో పంచకోశముల పరిధులు దాటు
చక్రములందున శక్తిదర్శనము సహస్రారమున శివుని దర్శనము
2.ఎఱుక ఒక్కటే వున్నతమైనది ఏకాగ్రతతో యెఱుకయు గలుగు
విశ్వమంతయు నిండుగ నిండిన విశ్వేశ్వరుడే తానని తెలియు
స్థూలమంతయు సూక్ష్మమె అగును చైతన్యమ్మే శాశ్వతమగును
జ్ఞానోదయమే కలుగును లోలో పంచకోశముల పరిధులు దాటు
3.మూలాధారమునందలి శక్తిని సహస్రారమున శివుని చేర్చిన
బ్రహ్మగ్రంధియు విష్ణుగ్రంధియు రుద్రగ్రంధియు ఛేదనమగును
మనసునందుగల మక్కువతొలగు నిశ్చలత్వము నిరతమునిలచు
సత్యము సతతము గోచరమగును స్థితతప్రజ్ఞుడై స్థిరముగనుండు
రచన: కొడవంటి smkodav@gmail.com
ఈ పాటను ప్రముఖ సంగీత విద్వాంసులు కులపతి శ్రీ ఇంద్రగంటి వేంకట లక్ష్మణ శాస్త్రి గారి శిష్యులు శ్రీ వారణాసి వేంకట బాల శంకరం గారు గురువుగారి సమక్షం లో పాడినారు. శంకరం గారి కుమారుడు చిరంజీవి వారణాసి జయదీప్ శర్మ మృదంగ సహకారం అందించారు. ఆ వీడియొ క్లిప్ ను ఈ దిగువ వీక్షించ గలరు.
======================================
TRUTH IS ONE
ప.సత్యమొక్కటే నిత్య సత్యమొక్కటే
అత్యద్భుతమైన ఆత్మ తత్వమొక్కటే
1.గాలి నీరు నిప్పు వుప్పు అందరికొకటే
సూర్యచంద్రులకాశము సృష్టి ఒక్కటే
సాధనతో సాధ్యమగు సత్యమొక్కటే
మతాతీతమగునట్టి మర్మమొక్కటే
2.పేదధనిక బేధమేమి లేనిదొక్కటే
కన్నులకు కానరాని కాంతి ఒక్కటే
సకల చరాచరములలో శక్తి ఒక్కటే
మాయసంసారమునకు ముక్తి ఒక్కటే
3.వేవేల వెలుగులకు వెలుగు ఒక్కటే
నీలోనాలో నిజముగ నున్నదొక్కటే
జీవిత పరమార్ధమ్మగు దర్శనమొకటే
జన్మరాహిత్యమునకు మార్గమొక్కటే
రచన: కొడవంటి smkodav@gmail.com
================================================
ప.యోగసుఖ నిధులైనవారికి మార్గమంతయు పూలబాట
గమ్యమంతయు గోచరంబగు గుహ్యమైన విద్యవలన
1.గురుడు చూపిన మార్గముననే గురుతు తెలియును సాధకునకు
గతులు తప్పక గమనమందిన ఇంద్రధనుసే జనితమగును
అందుగల జలమంతరించునుదివ్య తేజము గోచరించును
చిత్తమంతయు శాంతమందును చేతనము చిగురించుచుండును
2.అంతరాంతరములయందలి విశ్వమును వీక్షించుచుండును
విశ్వమందలి వింతవింతలు సంతసము చేకూర్చుచుండును
సతతమానందమును పొందుచు సత్యమందే సంచరించును
మోహమంతయు మాయమగును మోక్షమునకై నడక సాగును
3. అంతరమునకు బాహ్యమునకు అంతరమ్మే తెలియకుండును
అంతయునుసమమగుచునుండును అందరిని సమదృష్టిచూచును
వాక్కు అనునది శుద్ధమగును వచించునది సత్యమగును
నిర్గుణత్వమునిలచియుండునుఆత్మదర్శనమగుచునుండును
రచన: కొడవంటి smkodav@gmail.com
======================================
గమనిక:24.03.2006 న ప్రొఫెసర్ శ్రీ దేశిరాజు వెంకటరావు గారికి జరిగిన సన్మానము:
================================
ఉదయించే సూర్యుని
======================================
గమనిక:24.03.2006 న ప్రొఫెసర్ శ్రీ దేశిరాజు వెంకటరావు గారికి జరిగిన సన్మానము:
================================
ఉదయించే సూర్యుని
ఉదయించని సూర్యుని హృదయమందు గాంచుమా
1.భ్రమణమందు భూమియే సూర్యోదయమెచట గలదు
భ్రమలోపడి బ్రతుకంతా భయపడుతూ బ్రతుకకు
బ్రహ్మమె నీలోనున్నది దర్శించుము ధైర్యమ్ముగ
బ్రహ్మము నీవే నిజముగ నిలకడగా తెలియును
2. కలవంటిదె మెలకువయని వక్కాణించిరి విజ్ఞులు
మెలకువనే సాధించిన మరు జన్మయె లేదుకదా
వెలకట్టగ లేనివెన్నొ వెలువడెనుధధి మధింప
తెలివిగ నీలో నిఖిల జగమునే దర్శించుము
3. బ్రహ్మపదార్ధమ్మది బాహ్యమందు బయలుపడదు
బ్రహ్మము ప్రత్యక్షమ్మగు అంతర్మధనమువలన
బ్రహ్మమే దర్శనము అంతర్యానమున పర
బ్రహ్మమే నీవగుదువు అచంచల దీక్ష యున్న
ప. నీటి లోన నావ నిలకడగ నుండు
నీరుచేరిన నావ మునుగుచునుండు
సంసార జలధిలో సత్పురుషుడుండు
నీటిలో నావవలె నిలకడగ నుండు
1. నిలకడగలవాడు నిర్గుణుండు
ఎఱుకగలవాడు ఈశ్వరుండు
నిజము యెల్లపుడు నిష్ఠురముగానుండు
సత్యమార్గమ్మెపుడు సహజముగనుండు
2. నిప్పు యెల్లపుడు నివురుగప్పియుండు
ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
ఉత్తముండెల్లపుడు ఊహకందక యుండు
చిద్విలాసుండెపుడు చింతలే లేకుండు
3. నీలోన నాలోన నిజముగానుండు
పరమును చేర్చెడి పరమాత్ముడుండు
అంతరానందమును చవిచూపుచుండు
అంతటను నిండి ఆటలాడుచు నుండు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhKCNJqqcsLXe1QasI7IOJXiiA1QUr0_3o5S26VHCN2B-4RGwxD_uiedIR7CMaanQ6MuBDV4J7LGHXRPrQgwVp18B8VzVryUkf-SKO4GnYUs5vcyllnliBZtRHVUxfji6V8oZIWKUhMUPE/s200/p102.jpg)
1. పుట్టిన ప్రతి జీవి గిట్టుట తధ్యము కట్టెయై మిగులును కాలమే తీరును
చుట్టాలు పక్కాలు చుట్టు ప్రక్కలవారు పట్టుకొని పోవుదురు పాడె కట్టుకుని
చుట్టాలు పక్కాలు చుట్టు ప్రక్కలవారు పట్టుకొని పోవుదురు పాడె కట్టుకుని
2. తాత ముత్తాతలు రాజులు రౌతులు కాల గర్భములోన కన్ను మరుగైరి
నీవును నేనును ఏనాటికైనను కైలాస భూమిలో కాలవలసినదే
3. పెద్ద నిద్దుర లేని పరమాత్మ చేరెడి నిద్దురయె తెలివియగు నిజమొకటి కలదు
సద్దుసేయకమనసు సంధ్యనేతిలకింప అద్భుతంబగుజ్యోతి అంతరమ్మునవెలయు
4. జీవన్ముక్తుడై యుండగలిగెడి యుక్తి జీవించి యుండగనె పొందగలిగెడి శక్తి
జీవి యందెల్లపుడు జీవించి యుండు జీవ భావము వీడ దైవత్వమబ్బు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg96cfQNUOsTBSVek7c6eopr5B8J6cSjif_HhyphenhyphenWs3M9J7IIsYQC9Y7GmarpY4vq0Lv6UrE5DAmkaE_dRzv4bJx0biKCuLzz8yTPuLYNFVMzFWRbYBBMpG_CVjnecUUCySCF-bXDcaqsSKM/s200/Manikarnikabestblackfram.jpg)
1. ఆసలెన్నొ పడుచు నుందువు శ్వాస వున్నవరకె చెల్లును
శ్వాస వీడిన ఆస వీడును వీసమైన వెంట రాదుగా
2.కట్టె కట్టెల కాలునప్పుడు మట్టిలోనను కలియునప్పుడు
కట్టు కొన్నవి కానరావుగా కట్టెపైనను మోజు దండగ
కట్టు కొన్నవి కానరావుగా కట్టెపైనను మోజు దండగ
3.దేహమందుండును దేహియే దేహము కాదు నువు దేహివి
దేహ భ్రాంతిని మదిని వీడిన దేహియే దైవమై వెలయును
4.మోహమనునది నాశమందుట మోహక్షయమందుటె మోక్షము
దేహధారియే దైవము సందేహములేదిదియె సత్యము
******************************************************
వచ్చేది ఒక్కరే పోయేది ఒక్కరే
ప. వచ్చేది ఒక్కరే పోయేది ఒక్కరే
మధ్యలోనున్నదే మాయ బ్రతుకు మన
1. వచ్చునప్పుడు యేది తెచ్చేది లేదు
పోవునప్పుడు తన తోడేది రాదు
అహంకారమ్ముతో హుంకరించుట తప్ప
ఇహ లోకమ్మునా మిగిలేది లేదు
2. అరిషడ్వర్గాలు ఆవురావురుమని
కోరలే చాచు కోర్కెలే కోరు
లోలోన గల గుట్టు తెలియంగనీయక
బానిసను చేశాయి బంధమును పెంచాయి
3. సత్యదర్శియైన సామ్రాట్టు ఒక్కడే
గమ్యమును చేర్చగల గురుదేవుడతడే
నిశ్చలత్వమునొంది సత్య సాధన చేయ
నిజరూపదర్శనము నిక్కముగ గలుగు
4. ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము
ఆత్మయే నీవు అన్యమ్ముగావు
ఆనంద రూపమే నీదు రూపమ్ము
సచ్చిదానంద స్వరూపమే నీది
------------------------------------------------------------------------
0891 2740744, 0891 2547027, 9989719027 http://amrutam7.blogspot.com గాలి బుడగ ఈ జీవితము
గమ్మత్తుగ చేరు మృత్యువును
అ. ప.... గమ్యమునెరిగిన గుణవంతుండు
మృత్యుంజయుడై మనుట తధ్యము
1. విత్తమునందాసక్తిని వీడి
చిత్తము చిదంబరమ్మందుంచిన
దేహ భ్రాంతియె దూరమ్మగును
దివ్యమైన దర్శనమ్మగును
1. విత్తమునందాసక్తిని వీడి
చిత్తము చిదంబరమ్మందుంచిన
దేహ భ్రాంతియె దూరమ్మగును
దివ్యమైన దర్శనమ్మగును
2. దేహియె తానని దేహము కాదని
దేహిని మృత్యువు చేరగలేదని
దేహియె సర్వము నిండియుండునను
సత్యమునెరిగి మృత్యుంజయుడగు
దేహియె సర్వము నిండియుండునను
సత్యమునెరిగి మృత్యుంజయుడగు
====================================
దీపావళి
(అభేరి రాగము ..ఆది తాళము) రచన:కొడవంటి...04112010
ప. దీపావళి అంటేనే దివ్యమైన వెలుగు
దీపాల కాంతిలో నవ్య జగతి వెలుగు
1.భక్తిప్రదమైనది భగవానుని వెలుగు
రక్తిగలవారికది రమ్యమైన వెలుగు
ముక్తిప్రదమైనది మూలాధారపు వెలుగు
శక్తియైన వెలుగు అది సహస్రారపు వెలుగు
2.ఆస్తికత్వముతోడ అలరారెడి వెలుగు
నాస్తికత్వమే లేని నిత్య నూత్నమైన వెలుగు
ఆస్తితో కొనగలేని అవ్యక్తపు వెలుగు
ఆస్థితిలోమాత్రమే వ్యక్తమగు వెలుగు
3.దేహియే యైన వెలుగు దహరాకాశపు వెలుగు
పావనంబైన వెలుగు పతంజలుని వెలుగు
చిత్రమైన వెలుగు ఇది చిదంబరపు వెలుగు
చిదంబరపు వెలుగే అది చైతన్యపు వెలుగు
గుహ్యమైన వెలుగు సద్గురుదేవుని వెలుగు
వెలకట్టగలేని వెలుగు వేవేల కాంతి వెలుగు
4.కనుబొమల నడుమకడు విందుచేయు వెలుగు
జ్ఞానిగా అవతరించు విజ్ఞానపు వెలుగు
ఆత్మానుభవమున అత్యద్భుతమైన వెలుగు
స్వస్వరూప దర్శనాన సార్ధకమయ్యెడి వెలుగు
ఓం అసతోమాసద్గమయ తమసోమాజ్యోతిర్గమయ
మృత్యోర్మ అమృతంగమయ
ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:
======================================
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWCuaMXKpYU2gtHnNJ2QyPjk-Y1bhKyrHiydGXC3gfmM4fnwVVGVUipejvrjdh93knD_OXBpVkOwFEpdWQyiIx8UAiG3t3YqCfjv4V5Y9jR7tKlZcbyXOFQ9VGrsG1IpNV6a2bMuF-Um0/s200/mother-teresa-feeding.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj9bt7MzW0RCf0ev3cEUs57zcMfL0_gtOOUliP9L_Rk-naB8viFxPXxKG8R3npEwUsw7tQBN79GUmuvTrqaBruxc3wJEntgwdOeVjnb6APhHTfrsEUHQbKnoRs3QyBraqiKEKIXxQ8lYh4/s200/mother-teresa-john-paul-4.jpg)
ప. కనుపించే మానవునే కనికరింపలేకున్న
కనుపించని దైవమునెటు పూజించెదవోరన్న
1. కల్లలాడు మనసునకు కనికరమెట్టులకలుగు
కలయే నిజమనుకొని కపటపు బ్రతుకీడ్చుచుండు
కలవంటిదె మెలకువయను సత్యమ్మే తెలియకుండు
ప్రలోభములకీశ్వరుడు ప్రత్యక్షమ్మనుచునుండు
2. సంపాదించినదంతయు స్వంతమ్మని తలచుచుండు
భగవానుడుసృస్టించిన భాగ్యము తనదనుచునుండు
కోవెలలో లేనిపోని కోరికలే కోరుచుండు
కొబ్బరికాయలు కాసులు యెరచూపి మురియుచుండు
3. ఎంత ధనమునార్జించిన యేమి లాభమున్నది
జీవితపరమార్ధమ్మును తెలియజాలకున్నను
తానెవరో తెలిసినంత రజ్జు సర్ప భ్రాంతి తొలగు
చీకటంత వెలుగేయగు స్వస్వరూప దర్శనమగు
రచన:కొడవంటి... smkodav@gmail.com
============================
ఆనందం పరమానందం
(రచన: కొడవంటి 28102007)
ప. ఆనందం పరమానందం ఆనందం పూర్ణానందం
ఆనందం పూర్ణానందం ఆనందం బ్రహ్మానందం
1. ఉన్నదంతయు ఆనందం లేనిదంతయు ఆనందం
ఉన్నది లేనిది ఆనందం మిగిలినదంతా ఆనందం
2. నీలో వున్నది ఆనందం నాలో వున్నది ఆనందం
మన అందరిలో ఆనందం వున్నది ఒకటే ఆనందం
3. మాయ జగతియే ఆనందం మనసు గతియే ఆనందం
మనో నాశమే ఆనందం మౌన దీక్షయే ఆనందం
4. అరిషడ్వర్గము ఆనందం అంతరించుటే ఆనందం
ఆత్మ దర్శనము ఆనందం అవధులెరుగని ఆనందం
శ్లో. ఓం పూర్ణమదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణమేవ వశిష్యతే
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
====================================
kodavanti's other blogs may be viewed in the following site including bhakti, vedanta and vairagya songs etc.
KODAVANTI'S ENGLISH BLOG SITE:
DIFFERENT PATHS TO REACH THE SAME GOAL WORLD WIDE CAN BE VIEWED IN THE FOLLOWING SITES and vedio clippings projected in this blog:
1.http://www.youtube.com/watch?v=KVWQC4hT-pQ&feature=related
2.http://www.youtube.com/watch?
3. http://www.youtube.com/watch?v=jRuS2ttGurA
4. http://www.youtube.com/watch?v=2_a-Yh5FTaE&feature=related
Dear Sadhakas,
ReplyDeleteHow joyful it will be to see Guruji videos online ? Yes, we made a begining in that direction . Many thanks to Subramanyam garu, as he has updated his "vizinigiri vaibhavam' site with 1,2 videos, few more photos and soulful poetry.
http://vijinigiri7.blogspot.com/
It's amazing to see how Subrahmanyam garu, has developed this site at 75+ years age. My salutations to him.
In Gratitude,
venkat
Dear Subrahmanyam garu,
ReplyDeleteThe site is really amazing with the photos, poetry, videos. Site design, feel every thing is good. Have you done by your self ?
I am yet to read the poetry and will do as i move on.
Again my hearty thank you, for this amazing work.
Regards,
venkat
ఓం నమః,
ReplyDeleteనేను 26 వెబ్ సైటులు తయారు చేసేను. మన విజినిగిరి వైభవం 26 వ సైటు. ఈ 26 సైటులు http://amrutam7.blogspot.com/
అనే సైటులో వున్నాయి. నేను వ్రాసిన కొన్ని పాటల సంపుటి. ఇంకా వేదాంతం పాటలు, సంగీతం వగైరాలన్నీ వున్నాయి. అవకాశాన్ని బట్టి అందరు చూసి ఆనందించ గలరు. మీ ఆనందమే నా ఆనందం. మీ సంతోషమే నా సంతోషం. మీకందరకూ ధారణ బాగా వుండి వున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్న మీ
కొడవంటి సుబ్రహ్మణ్యం
venkat
ReplyDelete- Show quoted text -
---------- Forwarded message ----------
From: venkat sunkara
Date: Wed, Nov 10, 2010 at 9:37 AM
Subject: vizinigiri vaibhavam -- updated with Guruji Videos, photos
To: yogachaitanya@googlegroups.com
Dear Sadhakas, How joyful it will be to see Guruji videos online ? Yes, we made a begining in that direction . Many thanks to Subramanyam garu, as he has updated his "vizinigiri vaibhavam' site with 1,2 videos, few more photos and soulful poetry. http://vijinigiri7.blogspot.com/ It's amazing to see how Subrahmanyam garu, has developed Suneetha Kandi to yogachaitanya
show details 10 Nov (3 days ago)
Thanks for this wonderful information. Kudos to Sri Kodavanti
ఓం శ్రీ గురుభ్యోనమః
ReplyDelete